తెలంగాణలో షర్మిల పార్టీ.. ఖర్చు దండగ వ్యవహారమేనా.?

Sharmila Politics In Telangana

తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల. అన్న వైఎస్ జగన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేయడం ద్వారా తెలుగునాట తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షర్మిల, ఆ తర్వాత అనూహ్యంగా తెరమరుగైపోయారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం నిర్వహించినప్పటికీ, షర్మిలకు వైఎస్సార్సీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తగిన గుర్తింపునివ్వలేకపోయారు.

సరే, అది కుటుంబ వ్యవహారం.. అని సరిపెట్టుకోవాలేమో. ఇక, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన షర్మిల, ఇప్పటికే చాలా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో బహిరంగ సభ, హైద్రాబాద్‌లో పార్టీ ఆవిర్భావ సభ.. వెరసి షర్మిలకి బాగానే ఖర్చయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. ఇది కాక, నిరుద్యోగ సమస్యలపై పోరుబాట.. అంటూ గతంలో చేపట్టిన నిరాహార దీక్ష, తాజా ఆందోళనలు.. వెరసి, వీటన్నటికీ అదనంగా బోల్డంత ఖర్చవుతోంది మరి.

ఇప్పుడున్న రాజకీయాల్లో ఖర్చు అనేది తప్పనిసరి అంశం అయిపోయింది. వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేస్తే తప్ప రాజకీయాలు చేయలేని పరిస్థితి. ఇంతా చేసినా, తెలంగాణలో రాజకీయ పార్టీగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పార్టీ స్థాపించి రోజులు గడుస్తున్నా చెప్పకోదగ్గ నాయకుల్లో ఒక్కరైనా వైఎస్సార్‌టీపీ పంచన చేరకపోవడం షర్మిలకు ఒకింత ఆందోళన కలిగిస్తోందట. నిజానికి, హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగాల్సిన నేపథ్యంలో షర్మిల ఫోకస్ అటువైపు కాస్తయినా వుండి వుంటే, హైప్ వచ్చి వుండేది. కానీ, ఆ రణరంగంలోకి దిగి, చేతులు కాల్చుకోవడమెందుకన్న కోణంలో షర్మిల సంయమనం పాటిస్తున్నారట.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles