మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తర్వాతి సినిమాను శంకర్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. భారీ వ్యయంతో నిర్మితమవుతోంది ఈ సినిమా. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో చిత్రం ఉండబోతోంది. పాన్ ఇండియా సినిమా అంటే నటీనటీల విషయంలో అస్సలు తగ్గకూడదు. అన్ని పరిశ్రమల వారిని సినిమా ఆకట్టుకునేలా ఉండాలి. ప్రధానంగా తెలుగువారిని అమితంగా ఆకర్షించాలి. అందుకే శంకర్ సూపర్ ప్లాన్ ఒకటి వేశారని తెలుస్తోంది.
తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించడానికి మెగాస్టార్ చిరంజీవి చేత సినిమాలో ఒక ముఖ్య పాత్రను వేయించనున్నారట. ఇక మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కాంబినేషన్ అంటే ఆ లెవల్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తెలుగు పరిశ్రమ వరకు బోలెడంత క్రేజ్ దొరికినట్టే. ఇక శంకర్ డైరెక్షన్ కాబట్టి తమిళంలో కూడ డోకా లేదు. ఇక మిగిలిందల్లా హిందీ మార్కెట్. దాన్ని కూడ శంకర్ బలంగా టార్గెట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేత కూడ సినిమాలో ఒక రోల్ చేయించాలని శంకర్ భావిస్తున్నారట. ఎలాగూ సల్మాన్ చిరు కుటుంబానికి చాలా సన్నిహితుడు. వాళ్ళే గనుక అడిగితే కాదనే సమస్యే లేదు. ఇదే గనుక నిజమైతే సినిమాకు తప్పకుండా పాన్ ఇండియా అప్పీల్ వచ్చేసినట్టే. ఇకపోతే సినిమాలో చరణ్ ఐబీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని సీఎం కూడ అవుతాడనే టాక్ ఉంది. మరి చూడాలి శంకర్ సినిమాలో ఎన్ని మ్యాజిక్స్ చేస్తారో.