కైరా అద్వానీ హిందీలో బాగానే సినిమాలు చేసుకుంటోంది. తెలుగులో ‘భరత్ అనే నేను, వినయ విధేయ రామ’ చిత్రాలు చేసిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్లోనే ఉండిపోయింది. తెలుగు నుండి కొన్ని ఆఫర్లు వెళ్లినా నో చెప్పింది. ఆమెకే ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలింది. అది కూడ డైరెక్టర్ శంకర్ రూపంలో కావడం విశేషం. శంకర్ సినిమాలంటే ఏ లెవల్లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.భారీ బడ్జెయ్, స్టార్ నటీనటులు, బోలెడంత క్రేజ్, మంచి రోల్ అన్నీ కలిసోస్తాయి. అందుకే ఆయన దర్శకత్వంలో నటించాలని చాలామంది హీరోయిన్లు ఆరాటపడుతుంటారు.
కానీ శంకర్ చేసేది ఏడాదికి ఒక సినిమానే కాబట్టి అందరు హీరోయిన్లకు ఆయన సినిమాల్లో చేసే అవకాశం రాకపోవచ్చు. అలాంటిది కైరా అద్వానీకి మాత్రం తన వరుస సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారట శంకర్. కైరా అద్వానీతో తన సినిమాలు కొన్నింటికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. వాటిలో రామ్ చరణ్ చిత్రంతో పాటు ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ కూడ ఉంది. ఈ రెండూ కూడ హెవీ బడ్జెట్ సినిమాలే. త్వరలోనే రామ్ చరణ్ సినిమా విషయంలో కైరా అద్వానీ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. ఈ రెండు మాత్రమే కాదు శంకర్ సినిమాలు ఇంకొన్నింటిలో కూడ కైరానే కథానాయికగా తీసుకుంటారట. మొత్తానికి శంకర్ కైరా అద్వానీకి లైఫ్ సెటిలయ్యే డీల్ ఇచ్చారన్నమాట.