Aadi Saikumar: తెలుగు ప్రేక్షకులకు హీరో ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అది సాయికుమార్ సీనియర్ నటుడు హీరో సాయికుమార్ తనయుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సాయికుమార్ కొడుకు తనయుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అది సాయికుమార్ మొదట్లో రెండు మూడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ప్రేమ కావాలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత మధ్య మధ్యలో కాస్త గ్యాప్ తీసుకొని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు ఏవి ఆశించిన స్థాయిలో సక్సెస్ ను తెచ్చిపెట్టలేకపోయాయి.
ప్రస్తుతం ఆది చేతిలో మూడు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు అది సాయికుమార్. ఇందులో భాగంగానే ఇటీవల ఆది సాయి కుమార్ హీరోగా శంబాల అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు ఆది సాయి కుమార్ పుట్టిన రోజు కావడంతో శంబాల సినిమా నుంచి హీరో ఆది ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ పోస్టర్ చూస్తుంటే హీరో సైకిల్ మీద మంటల్లోంచి వస్తున్నట్టు ఏదో యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన సీన్ అని తెలుస్తోంది. ఇందులో ఆది పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నట్టు పోస్టర్ని చూస్తే అర్థమవుతుంది. కాగా ఇక ఈ శంబాల సినిమాను ఏ యాడ్ ఇన్‌ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని డైరెక్ట్ చేస్తుండగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
#Shambala team wishing you a very Happy birthday to our beloved hero @aadipudipeddi @iamaadisaikumar @tweets_archana @SwasikaVlog@ugandharmuni #RajasekharAnnabhimoju #MahidharReddy #ShambhalaAMysticalWorld #ShiningPictures @ShiningPictures pic.twitter.com/Y8LhgyaADi
— Shining Pictures (@ShiningPictures) December 23, 2024
ఇటీవల శంబాల సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించబోతున్నారట. పీరియాడిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.హాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్ తో కలిసి పనిచేసిన శ్రీరామ్ మద్దూరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా పోస్టర్ రిలీజ్ చేయగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఇక నేడు అది సాయి కుమార్ పుట్టిన రోజు కావడంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఈ హీరోకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఇలా ఉంటే ఈ పోస్టర్ పై కొందరు స్పందిస్తూ ఈసారైనా ఆది సాయికుమార్ సక్సెస్ సాధించేనా? ఈసారైనా సినిమా హిట్ అవుతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి.