భావోద్వేగం.. కేసీయార్ మార్కు పొలిటికల్ జిమ్మిక్కు: పేర్ని నాని

Sentiment, KCR Mark Political Gymmik: Perni Nani

Sentiment, KCR Mark Political Gymmik: Perni Nani

ఆంధ్రపదేశ్ మంత్రి హోదాలో కాదు, వ్యక్తిగతంగా చెబుతున్నా.. భావోద్వేగాలు పండించడంలో కేసీయార్ దిట్ట. ఆయన ఇప్పుడు చేస్తున్నదదే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కేసీయార్ ప్రభుత్వం చేస్తున్నది రాజకీయ రాద్ధాంతం మాత్రమే..” అంటున్నారు ఆంధ్రపదేశ్ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని.

‘తెలంగాణకీ, ఆంధ్రపదేశ్ రాష్ట్రానికీ ఉమ్మడి రాజధాని అయిన హైద్రాబాద్ మీద మాకు ఇంకా హక్కు వుంది. ఇంకో మూడేళ్ళు మాకు హైద్రాబాద్ మీద హక్కు వున్నప్పటికీ, ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చలు ఫలించి, అసెంబ్లీ, సెక్రెటేరియట్ విషయంలో తెలంగాణకు అనుకూలంగా ఆంధ్రపదేశ్ వ్యవహరించింది.

కానీ, మీరు చేసిందేంటి.?’ అంటూ టీఆర్ఎస్ నేత ప్రకాష్ మీద విరుచుకుపడ్డారు మంత్రి పేర్ని నాని ఓ చర్చా కార్యక్రమంలో.

కొన్నాళ్ళ క్రితం తెలంగాణలోని ప్రగతిభవన్ సాక్షిగా కేసీయార్, వైఎస్ జగన్ మధ్య ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిగిన విషయం విదితమే. కృష్ణ, గోదావరి నదులపై ప్రాజెక్టులు సహా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనేక వివాదాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి.

చర్చల్లో కొంత సానుకూలత ఇరు పక్షాల నుంచీ వ్యక్తమయ్యింది. అయితే, ఆ తర్వాత ఏమయ్యిందోగానీ, గ్యాప్ ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీల మధ్యా పెరుగుతూ వచ్చింది.

ఈటెల రాజేందర్, కేసీయార్ మంత్రి వర్గం నుంచి తొలగించబడటం.. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఎమ్మెల్య పదవికి రాజీనామా చేయడం, హుజూరాబాద్ ఉప ఎన్నిక తప్పనిసరవడంతో.. ఈక్వేషన్స్ మారిపోయాయి.. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడం మొదలైంది.

కేవలం హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలుపు కోసమే కేసీయార్, ఇరు రాష్ట్రాల మధ్యా నీటి వివాదాన్ని తెచ్చారన్నది పేర్ని నాని ఆరోపణ.