భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఎగబాకాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, చమురు భయాలు నేపథ్యంలో కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పైకి లేచాయి. రియాలిటీ, ఐటీ, ఫార్మా రంగాలు రాణించడంతో సూచీల పెరుగుదులకు కారణమైంది. సెన్సెక్స్‌ 581 పాయింట్ల లాభంతో 53,424.09, నిఫ్టీ 150.30 పాయింట్లు పెరిగి 16,013.45 వద్ద ముగిసింది. టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, టైటన్‌, నెస్లే ఇండియా, రిలయన్స్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాలను చవిచూసింది.. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.94 వద్ద కొనసాగుతోంది.