సెన్సేషనల్ అప్డేట్ : “కేజీఎఫ్ 3” పై ఊహించని వార్త..డోంట్ మిస్.!

KGF Chapter 3

KGF Chapter 3  : ఈ ఏడాదిలో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో దుమ్ము లేపిన చిత్రాల్లో మన సౌత్ ఇండియా నుంచే రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మన తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కాగా మరో సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచి వెళ్లిన చిత్రం “కేజీఎఫ్ చాప్టర్ 2”. మరి ఆ సినిమాని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు.

అయితే రాకింగ్ స్టార్ యష్ నటించిన ఈ సినిమాలో తాను చేసిన రాకీ భాయ్ పాత్ర ఇప్పుడు అందరిలోని నాటుకు పోయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక సినిమా అంతా చూసిన వాళ్ళకి ఈ సినిమా మేకర్స్ మరో ఎగ్జైటింగ్ షాక్ ని ఇచ్చారు. ఈ చిత్రం కి మళ్ళీ మూడో పార్ట్ కూడా ఉందని క్రేజీ అనౌన్సమెంట్ చెయ్యడంతో ఒక్కసారిగా మళ్ళీ అందరిలో ఆసక్తి రేగింది.

అయితే ఇప్పుడు ఈ మూడో సినిమాపై సెన్సేషనల్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్ర నిర్మాతనే స్వయంగా ఈ అప్డేట్ ని ఇచ్చినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమాకి చాప్టర్ 3 ని తీసుకొస్తున్నామని పైగా ఆ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది అక్టోబర్ లోనే స్టార్ట్ చేస్తున్నామని ఊహించని అప్డేట్ ని ఇప్పుడు వారు అందించారు.

అలాగే ఈ సినిమాతో తాము హాలీవుడ్ ప్రముఖ సినిమాల ఫ్రాంచైజ్ మర్వెల్ సినిమాల్లా తీసుకురావాలని ఫిక్స్ అయ్యామని తెలిపారట. అంటే మన ఇండియన్ సినిమా దగ్గర కూడా అదిరిపోయే ఫ్రాంచైజ్ వచ్చినట్టే అని చెప్పాలి.