Bheemla Nayak: భీమ్లా నాయక్ ట్రైలర్ పై స్పందించిన సంచలన తార శ్రీ రెడ్డి… ఏమన్నారంటే?

Bheemla Nayak:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా మల్టీస్టారర్ గా మలయాళ చిత్రానికి రీమేక్ చిత్రం గా సాగర్ కి చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశం నిర్మించిన చిత్రం
భీమ్లా నాయక్.ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమవారం నిర్వహించాలని నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.అయితే అనుకోని విధంగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ వీడియో పై ప్రశంసలు కురిపించగా మరికొంత మంది పెదవి విరుస్తున్నారు. ట్రైలర్ సాఫీగా సాగిపోతుందని అనుకున్నంత బేస్ లేదని పవన్ అభిమానులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ సోర్స్ పెద్దగా లేదని పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ పై సంచలన తార శ్రీ రెడ్డి స్పందించారు.

పవన్ కళ్యాణ్ గురించి గతంలో సంచలన వ్యాఖ్యలు చేసి పెద్దఎత్తున వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఈక్రమంలోనే ఈమె తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా ట్రైలర్ అనుకున్నంతగా లేదు ఆవరేజ్ అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. భీమ్లా నాయక్ ట్రైలర్ అంటూ పక్కనే నవ్వుతున్న ఎమోజీ పెట్టీ మరో ట్వీట్ చేసింది శ్రీ రెడ్డి.ఈ క్రమంలోని ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శ్రీరెడ్డి అభిమానులు పవన్ అభిమానుల మధ్య కాసేపు ట్వీట్ వార్ జరిగిందని చెప్పవచ్చు.