RRR movie : “RRR” పై సెన్సేషనల్ రూమర్? హాలీవుడ్ గెస్ట్ పై క్లారిటీ మీకోసం.!

RRR movie :పాన్ ఇండియా వైడ్ వీక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న కొన్ని సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలు మన టాలీవుడ్ నుంచే ఉన్నాయని చెప్పాలి. భారీ అంచనాలు నెలకొల్పుకొని ఎప్పుడు రిలీజ్ అయ్యినా కూడా బాక్సాఫీస్ రికార్డులు నెలకొల్పడం ఖాయం అనిపించే సినిమా మాత్రం దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్తా ఏక్షన్ థ్రిల్లర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) అని చెప్పాలి.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కూడా ఇదే అని చెప్పాలి. మరి ఫైనల్ గా మళ్ళీ ఈ భారీ సినిమా రిలీజ్ కి చిత్ర బృందం డేట్ ఫిక్స్ చెయ్యగా మళ్ళీ సినిమాకి వేడుకలు చెయ్యాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడు ఒక ఊహించని టాక్ సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ సినిమాకి చేసే గ్రాండ్ ఈవెంట్స్ లో ఒకదానికి గాను ఏకంగా హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూయిజ్ ని దింపుతున్నారని అనేక సినీ వర్గాలు వారు చెబుతున్నారు. కానీ దీనిపై క్లారిటీ తెలుస్తుంది.

అసలు చిత్ర బృందం ఇలాంటి ప్లాన్ ఒకటి వెయ్యనే లేదు అట. ప్రస్తుతానికి ఈ వార్త పూర్తిగా అవాస్తవం అనే తెలుస్తుంది. ఇలాంటివి ఏమన్నా ఉంటే చిత్ర బృందమే అధికారికంగా తెలియజేస్తారని ఇన్సైడ్ టాక్. మరి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందా అని అభిమానులు అయితే ఆసక్తిగా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు.