షాకింగ్ : సెన్సేషనల్ ధరకి “కేజీఎఫ్ 2” ఒక్క స్ట్రీమింగ్ హక్కులు.!

KGF Chapter 2 : ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన మరో భారీ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా అన్ని భాషల్లో కూడా భారీ వసూళ్లను కొల్లగొడుతూ వస్తున్న ఈ చిత్రం RRR కి దగ్గరగా కూడా వచ్చేసింది.
మరి ఈ వసూళ్ల నంబర్స్ తోనే ఈ సినిమా ఆశ్చర్యపరుస్తుండగా రీసెంట్ గా సినీ వర్గాల్లో ఈ సినిమా ఓటిటి హక్కులు ఎంతకి అమ్ముడు పోయాయో అన్న దానిపై మైండ్ బ్లోయింగ్ ఫిగర్ వినిపిస్తుంది. ఈ సినిమాని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది నమ్మరు గాని ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ఒక్క ఓటిటి హక్కులు ఏకంగా 320 కోట్లకి అమ్ముడుపోయాయట.
అసలు ఇది కనీ వినీ ఎరుగని రికార్డు చెప్పాలి. సాధారణంగా ఇలాంటి ధరలు ఒక డైరెక్ట్ సినిమాకి గాని ఇవ్వరు అలాంటిది ఈ సినిమాకి రిలీజ్ అయ్యాక కూడా ఇంత మొత్తంలోకి పలికింది అంటే ఈ సినిమా ఉన్న క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవాలి. ఇంకా ఈ భారీ సినిమాలో రవీనా, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ మరియు రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు చెయ్యగా హోంబలే పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.