Allu Arjun : వైరల్ : అల్లు అర్జున్ నటనపై సెన్సేషనల్ దర్శకుడు కామెంట్స్.!

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప పార్ట్ 1” రీసెంట్ గా రిలీజ్ అయ్యి భారీ స్థాయి హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమా పెద్ద హిట్ కావడానికి కారణం దర్శకుడు సుకుమార్ టేకింగ్ ఒకటి కాగా ఇంకొకటి మాత్రం పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటన అని చెప్పాలి. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ చేసిన నటన మాత్రం వేరే స్థాయిలో ఉంది.

ఇదే నటన కాన్సెప్ట్ కానీ వేరే ఏ ఇండస్ట్రీలో చేసినా ఈపాటికి మనవాళ్ళు నెత్తిన పెట్టుకునే వారు. మరి ఇప్పుడు ఐకాన్ స్టార్ నటనపైనే సెన్సేషనల్ దర్శకుడు సందీప్ వంగ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన మిస్సైల్ కన్నా ఏమాత్రం తక్కువా కానట్టుగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి అల్లు అర్జున్ నటనకి ప్రతి ఒకరు కూడా ఫిదా అవుతారు.

నిజంగా అతడు అందరి అభినందనలకి అర్హుడు అని తెలిపాడు. అలాగే మూవీ హిస్టరీ లోనే అల్లు అర్జున్ నటన ది బెస్ట్ గా నిలుస్తుంది అని సందీప్ తెలిపాడు. మరి అర్జున్ రెడ్డి తో సెన్సేషనల్ దర్శకునిగా మారిన సందీప్ వంగ ఇప్పుడు బాలీవుడ్ లో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. అలాగే ఇంకో పక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే పాన్ ఆసియా సబ్జెక్టు ని చేయడానికి రెడీగా ఉన్నాడు.