మళ్లీ కూడ సాయి పల్లవియేనా ?

Sai Pallavi in Dhanush movie
Sai Pallavi in Dhanush movie
 
దర్శకుడు శేఖర్ కమ్ముల తమిళ హీరో ధనుష్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ధనుష్ తెలుగులో నటిస్తున్న ఫస్ట్ స్ట్రైట్ మూవీ కావడం విశేషం.  ధనుష్ తమిళ సినిమాలకు తెలుగునాట కూడ మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన తెలుగులో సినిమా చేసున్నారు అనేసరికి అందరిలోనూ ఆసక్తి నెలకొంది.  ఈ సినిమాను ఏషియన్ గ్రూప్ భారీ లెవల్లో నిర్మిస్తోంది.  పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఉండబోతుంది.  తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే సాయి పల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 
 
ఎందుకంటే శేఖర్ కమ్ముల గత రెండు చిత్రాల్లోనూ సాయి పల్లవే హీరోయిన్.  వీరు కలిసి చేసిన ‘ఫిదా’ భారీ సక్సెస్ సాదించింది.  అందుకే ఆమెను నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’లో కూడ తీసుకున్నారు ఆయన.  ఈ సినిమా మీద కూడ మంచి బజ్ ఉంది.  అందుకు ప్రధాన కారణం కూడ సాయి పల్లవే.  ఆమె పెర్ఫార్మెన్స్ మీదమే శేఖర్ కమ్ముల గురి.  అందుకే ధనుష్ సినిమాలో కూడ ఆమెనే తీసుకోవాలని చూస్తున్నారట.  ధనుష్, సాయి పల్లవి కూడ గతంలో ‘మారి 2’ చిత్రంలో కలిసి నటించడం జరిగింది.  వీరి జోడీకి మంచి మార్కులే పడ్డాయి.  దాంతో సాయి పల్లవిని దాదాపు ఫైనల్ చేసుకునే అవకాశాలున్నాయట. ఇదే గనక నిజమైతే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఈ ప్రాజెక్ట్‌తోనే జరగుతుంది. చూడాలి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు ఉంటుందో.