మరోసారి రామయ్యతో జతకట్టబోతున్న సీతమ్మ.. ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్?

హను రాఘవపూడి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సీతారామం. అద్భుతమైన క్లాసికల్ ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను అందుకుంటుంది.ఇలా మొదటి సినిమాతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటి మృణాల్ కు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయని తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం నందమూరి హీరో యంగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన ఈమె నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాని ప్రకటించినప్పటికీ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే కథనాయక ఎవరు అనే విషయం గురించి వెల్లడించలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మృణాల్ ను ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇప్పటికే చిత్ర బృందం ఈమెను సంప్రదించి ఈమెతో సంప్రదింపులు చేస్తున్నారని అయితే ఈ సినిమాలో నటించడానికి ఈమె కూడా ఎంతో సానుకూలంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక త్వరలోనే ఈ విషయంపై కూడా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.ఇక ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుంది. అయితే వీలైనంత త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.