రౌడీ బ్రదర్ ఆనంద్ దేవరకొండ.. సమ్‌థింగ్ స్పెషల్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయ్ ఈ కుర్రోడిలో. డిఫరెంట్‌గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ యాక్సెంట్‌లోనూ చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు. ‘దొరసాని’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. తొలి సినిమా ఫెయిలైనా, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో ఓటీటీ ప్లాట్‌ఫామ్ పుణ్యమా అని, మ్యాగ్జిమమ్ ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు.
ఇప్పుడు ‘పుష్పక విమానం’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. ‘పుష్పక విమానం’ సినిమా ట్రైలర్ ఇప్పటికే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఆనంద్ దేవరకొండ ఆటిట్యూడ్, అప్పియరెన్స్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇకపోతే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మనోడు తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి మూడు ముక్కలు చెప్పాడండోయ్. దీపావళి స్పెషల్ ఇంటర్వ్యూలో ఆనంద్ తన లవ్ స్టోరీని రివీల్ చేశాడు. కానీ, ఆ అమ్మాయి ఎవరో మాత్రం చెప్పలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆనంద్ లవ్ గురించి ఆయన ఫ్యామిలీకి కూడా తెలుసంట. అదీ సంగతి.