‎Arabia Kadali: తండేల్ సినిమాను తలపిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్.. వీడియో వైరల్!

‎‎Arabia Kadali: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నటుడు హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయమంటారలేదు. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాగా తాజాగా హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు సత్యదేవ్. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర కంటెంట్‌ తో అభిమానుల ముందుకు రాబోతున్నారు.

‎ఆయన ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న వెబ్ సిరీస్‌ అరేబియా కడలి. ఈ వెబ్ సిరీస్‌ కు వీవీ సూర్యకుమార్ ‍దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్‌ రూపొందిస్తోన్న ఈ సిరీస్‌ ఆగస్టు 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అరేబియా కడలి ట్రైలర్‌ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్‌ సినిమాను తలపించేలా కనిపిస్తోంది. మత్స్యకారుల బ్యాక్‌ డ్రాప్‌లోనే ఈ వెబ్ సిరీస్‌ ను రూపొందించారు.

 Arabia Kadali - Official Trailer | Prime Video India

‎చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను పాకిస్తాన్‌ కు బందీలుగా దొరికిపోవడం ఆ తర్వాత జరిగే పరిణామాలతో ఆసక్తి పెంచుతోంది. సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సిరీస్‌ లో చూపించనున్నారు. ఈ సిరీస్‌లో ఆనంది, నాజర్, రఘు బాబు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ట్రైలర్ ని చూసిన ప్రేక్షకులు తండేల్ 2 అంటూ కామెంట్లు చేస్తున్నారు.