Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో నటులుగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ వర్సెస్ సత్యరాజ్ అనే విధంగా వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో తమిళనాడులో జరిగిన మురుగన్ భక్తల్ మానాడు కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు సత్యరాజు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాము పెరియార్ సిద్ధాంతాలను నమ్ముకున్నామని అయితే దేవుడి పేరుతో ఇక్కడ రాజకీయాలు చేస్తే అసలు సహించమంటూ వార్నింగ్ ఇచ్చారు.
తమిళ ప్రజలు చాలా తెలివైన వారు అంత సులువుగా ఎవరి మాటలు విని మోసపోరని అలా మీరు మోసం చేసాము అనుకుంటే తప్పు చేసినట్లే అంటూ పవన్ కళ్యాణ్ గురించి సత్య రాజు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇలా సత్యరాజు పవన్ కళ్యాణ్ గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇండస్ట్రీ నుంచి ఏ ఒకరు కూడా స్పందించకపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇండస్ట్రీ నుంచి డిప్యూటీ సీఎం హోదాలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గురించి ఒక నటుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపేవారు ఎవరూ లేరా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన పని తెలిసి అందరూ ఫిదా అవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గురించి సత్యరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకున్న హరీష్ ఏ మాత్రం ఆలోచించకుండా తనని సినిమా నుంచి తొలగించారని తెలుస్తోంది.