అక్కడ మాత్రం డిజాస్టర్ గా నిలిచిపోయిన “సర్కారు వారి పాట” రిజల్ట్.!

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata : టాలీవుడ్ నుంచి ఈ ఏడాది భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫస్ట్ టైం నటించిన చిత్రం “సర్కారు వారి పాట” కూడా ఒకటి. దర్శకుడు పరశురామ్ పెట్లతో చేసిన ఫస్ట్ చిత్రం అయినా మంచి అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి కాస్త డివైడ్ టాక్ తో స్టార్ట్ అయినా మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమాకి ఇన్ని చోట్ల మంచి హిట్ అయినా ఓ దగ్గర మాత్రం డిజాస్టర్ గా నిలిచిందట. ఈ సినిమా రిలీజ్ టైం లో మన దగ్గరతో పాటుగా తమిళ నాట కూడా మంచి అంచనాలు ఉన్నాయని ప్రొజెక్ట్ చేస్తూ గ్రాండ్ గానే రిలీజ్ చేసారు. కానీ అనూహ్యంగా ఈ చిత్రానికి అక్కడ డిజాస్టర్ రిజల్ట్ దక్కింది.

అక్కడ ఈ సినిమాని కొనుగోలు చేసిన టార్గెట్ ని అయితే రీచ్ కాలేకపోయింది అని ఫైనల్ గా అయితే అక్కడ సర్కారు వారి పాట మాత్రం ప్లాప్ గా నిలిచిపోయినట్టు ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. అయితే గతంలో పలు మహేష్ సినిమాలు మంచి ఆదరణ దక్కించుకొని ఈ సినిమా ప్లాప్ అవ్వడం ఆశ్చర్యకరం. ఇంకా ఈ సినిమాలో నదియా, సముద్రఖని, సుబ్బరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.