Sandeep Reddy Vanga: లగ్జరి కారు కొనుగోలు చేసిన సందీప్ రెడ్డి వంగా.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Sandeep Reddy Vanga: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో హీరోగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ క్రేజీ డైరెక్టర్ తన గ్యారేజీ లోకి కొత్త కారును చేర్చుకున్నారు. అది కూడా యూరప్ బ్రాండ్ అయిన మినీ కూపర్ కావడంతో సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.

కొత్తగా కొనుగోలు చేసిన మినీ కూపర్ కార్‌ ను పూజలతో బయటకు తీస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆడి లాంటివి కాకుండా, స్టైలిష్ లుక్స్ ఉన్న గ్రీన్ షేడ్ కూపర్ మోడల్‌ ను ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది. కార్ ముందు భాగంలో పూలతో అలంకరించడం, హారతి కార్యక్రమంలో సతీమణి పాల్గొనడం స్పష్టంగా ఫోటోల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌ లో మినీ కూపర్ మోడల్స్ ధరలు రూ.42.7 లక్షల నుండి రూ.55.9 లక్షల మధ్య ఉంటాయి.

కార్, స్టైల్, క్లాస్ అన్నీ కలిపి ఈ బ్రాండ్‌ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. డైరెక్టర్ వంగా కార్ స్టైల్ చూస్తే దీని ధర దాదాపుగా రూ.50 లక్షలకు పైగానే ఉండే అవకాశం ఉంది. ఇక వంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందే స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.