Balakrishna: నందమూరి నటసింహ బాలకృష్ణ ఇటీవల కాలంలో ఎంతో బిజీగా గడపుతున్నారు. వరుస సినిమాలకు కమిట్ అవుతున్న ఈయన ఒకవైపు సినిమా వ్యవహారాలతో పాటు మరోవైపు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్నారు. సినిమాలు రాజకీయాలు అని మాత్రమే కాకుండా పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలకృష్ణ వేగ జువెలర్స్ అనే నగల సమస్యకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ నగల సమస్థ పలు ప్రాంతాలలో తమ కొత్త బ్రాంచులను ఏర్పాటు చేస్తూ వచ్చారు. తాజాగా కాకినాడలో ఒక షోరూం ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఏలూరు బస్టాండ్ సమీపంలో మరొక షోరూమ్ ఏర్పాటు చేశారు. ఇక ఈ షో రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణతో పాటు నటి సంయుక్త మీనన్ కూడా హాజరయ్యారు. ఇలా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ షో రూమ్ ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మీడియా సమావేశంలో భాగంగా అఖండ సినిమా గురించి పలు విషయాలు మాట్లాడారు.
ఇకపోతే బాలకృష్ణతో పాటు నటి సంయుక్త మీనన్ కూడా ఈ కార్యక్రమానికి రావడమే కాకుండా ఈమె తిరిగి వెళుతున్న సమయంలో బాలకృష్ణ గారి వద్ద ఆశీర్వాదం తీసుకొని వెళ్లారు. బాలకృష్ణ పక్కన ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా ఈమె వెనకనుంచి బాలయ్య గారి పాదాలకు నమస్కారం చేశారు. అయితే ఒక్కసారిగా బాలకృష్ణ ఉలిక్కిపడ్డారు. ఇలా ఆమె పాదాలకు నమస్కరించారనే విషయం తెలుసుకున్న బాలయ్య తన తలపై చేయి పెట్టి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వాదం అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.