వైరల్ : పవన్ తో సినిమాపై ఓ రేంజ్ హైప్ ఇచ్చిన సముద్రఖని.!

Samuthirakani : గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భారీ క్రేజ్ ఉంది అయితే ఆ క్రేజ్ ని ఏవేవో రీమేక్ సినిమాలు చేస్తూ పాడు చేసుకుంటున్నాడని ఒక వాదన ఉండగా ఇప్పుడు తాను ఉన్న పరిస్థితుల్లో ఏ సినిమా అయినా ఒకటే దొరికిందే ప్రసాదం అని పవన్ అభిమానులు కొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే మరి ఇప్పుడు పవన్ చేస్తున్న పలు స్ట్రైట్ సినిమాల్లో ఇరికించ బడ్డ మరో రీమేక్ సినిమా కూడా ఉంది. తమిళం లో సూపర్ హిట్ అయిన “వినోదయం సైతం” కి రీమేక్ గా పవన్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ లు నటించబోతున్నారు. అయితే ఈ సినిమాని ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు.

మరి తెలుగులో కూడా తానే దర్శకత్వం వహించనుండగా త్రివిక్రమ్ మళ్ళీ మాటలు చేర్పులు అందించనున్నారు. అయితే తాజాగా సముద్రఖని చేసిన కామెంట్స్ అయితే ఈ రీమేక్ సినిమాపై కూడా హైప్ తెప్పిస్తున్నాయి. నేను కూడా పవన్ గారికి అభిమానినే ఆయన్ని ఎలా చూపిస్తానో రేపు మీరే చూస్తారు అంటూ చాలా కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ అందించారు.

దీనితో జస్ట్ ఈ మాటలతోనే ఈ సినిమాపై ఎక్కడికో వెళ్ళింది. అలాగే ఈ సినిమా పై అధికారిక అనౌన్సమెంట్ త్వరలోనే వస్తుంది అని ఇంకో అదిరే క్లారిటీని అయితే తాను అందించారు.