చిరంజీవి ఛాయిస్ కూడ అతగాడేనట

Samudrakhani doing key role Chiranjeevi's Lucifer remake
Samudrakhani doing key role Chiranjeevi's Lucifer remake
తమిళ నటుల హవా తెలుగులో పెరిగిపోతోంది. ప్రత్యేక పాత్రల సహా ప్రతినాయకుల రోల్స్ కోసం వారినే అప్రోచ్ అవుతున్నారు మన దర్శక నిర్మాతలు.  తమిళ స్టార్లు సైతం తెలుగులో రెమ్యునరేషన్ దండిగా వస్తుండటం, ఇక్కడి ప్రేక్షకులు ఆదరణ చూసి తెలుగు సినిమాలకు అస్సలు నో చెప్పట్లేదు.  వీలు చూసుకుని మరీ డేట్స్ కేటాయిస్తున్నారు. ఇలా తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంటున్న నటుల్లో సముద్రఖని కూడ ఒకరు.  సముద్రఖని ఇటీవల చేసిన ‘అల వైకుంఠపురములో, క్రాక్’ చిత్రాలు భారీ విజయాలుగా నిలిచాయి. రెండింటిలోనూ సముద్రఖని నటన తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది.  స్టార్ హీరోలకు మంచి విలన్ అనే పేరు తెచ్చుకున్నాడు.  
 
ఇప్పటికే ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సర్కారువారి పాట చిత్రంలో విలన్ గా ఫిక్స్ అయ్యారు.  పవన్ కళ్యాణ్ చేస్తున్న అయ్యప్పనుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్లో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు.  ఇవి కాకుండా తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న లూసిఫర్ తెలుగు రీమేక్లో ఒక ముఖ్యమైన పాత్రను చేసే అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది.  అయితే అది విలన్ పాత్ర లేకపోతే వేరే ఏదైనా పాత్ర అనేది తెలియాల్సి ఉంది.  మొత్తానికి సముద్రఖని మన స్టార్ దర్శకులు, హీరోలకు ఒక మంచి ఛాయిస్ అయ్యారు.  సినిమాలే కాదు తెలుగులో ఓటీటీ కంటెంట్ కూడ చేస్తున్నారు సముద్రఖని.