అతడితో సమంత రెండో పెళ్లి?

తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది. హిందీ లో ‘ఫామిలీ మాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్లో లో తన నటనతో అందర్నీ మెప్పించి, హిందీ లో కూడా పాపులర్ అయ్యింది సమంత. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సమంత హిందీ సినిమాలు కూడా సైన్ చేస్తుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో ఒక సినిమా చేస్తుంది, అలాగే ఇంకో వెబ్ సిరీస్ లో కూడా సైన్ చేసే ఆలోచనలో ఉంది సమంత.

అయితే తాజా గా సమంత బాలీవుడ్ కి చెందిన ఒక వ్యక్తిని పెళ్లాడుతుందని తెలుస్తుంది. అతను ‘ఫామిలీ మాన్’ సిరీస్ టైం లో సమంత కి క్లోజ్ అయ్యాడట. ఇప్పుడు సమంత కోసం తన మకాం హైదరాబాద్ కి మార్చేసాడని తెలుస్తుంది.

సమంత తమ కోసం జూబిలీ హిల్స్ లో ఒక కొత్త ఇంటిని సిద్ధం చేసుకుంటుంది. ప్రస్తుతం అతను సమంత ప్లాట్ లోనే ఉంటున్నాడు. అతన్ని సమంత ఫ్లాట్ లో చూసిన ఓ యంగ్ డైరెక్టర్ ఈ వార్తను ఇండస్ట్రీ మొత్తానికి ఊదాడు.

వీరి విషయం చైతుకు తెలిసినప్పటి నుంచే.. నాగ చైతన్య, సమంత మధ్య విబేధాలు వచ్చాయని ఒక న్యూస్ ఉంది. విడాకుల తర్వాత ఇద్దరూ వారి వారి సినిమాలతో బిజీ గా ఉన్నారు.