Samantha: సినీ నటి సమంత ప్రస్తుతం తిరిగి సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఈమె గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం సమంత తన కెరియర్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఈమె బిజీ అవుతున్నారు.
ఇకపోతే సమంత ఇటీవల ఓ నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా తన ప్రొడక్షన్ హౌస్ నుంచి మొదటి సినిమా రాబోతుంది ఈ క్రమంలోనే తన మొదటి సినిమా గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేశారు. సమంత ప్రొడక్షన్ హౌస్ ట్రూలాల నుంచి తన మొదటి సినిమా శుభం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
అయితే సమంత ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారి పూర్తి సపోర్ట్ లభిస్తుందని తెలుస్తోంది.సమంత శుభం సినిమా పోస్టర్ రిలీజ్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ సమంత సినిమాకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే సమంత తన మొదటి సినిమాని మైత్రి వారితో కలిసి విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.
లుకింగ్ ఫార్వర్డ్ అంటూ మైత్రి మేకర్స్ మెసేజ్ పెట్టడం చూస్తే నిజంగానే సమంత శుభం సినిమా మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు. సినిమా బండి మేకర్ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది ఈ సినిమాలో నటీనటులందరూ కూడా కొత్తవారు కావటం విశేషం. ఇలా శుభం అనే టైటిల్ తో సమంత కొత్త సినిమాను ప్రకటించడంతో అభిమానులందరూ కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.