కెరీర్ మంచి పీక్ లో ఉండగానే సిధార్థ తో ప్రేమలో పడింది. ఒక సమయం లో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏమైందో…ఇద్దరూ విడిపోయారు. కొన్నాళ్ళకు నాగ చైతన్య తో డేటింగ్ చేసి, పెళ్లిచేసుకుంది. అయితే నాలుగు సంవత్సరాలకే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులకు చాలా కారణాలు ఉన్నట్టు వార్తలు వొచ్చాయి కానీ దీని పై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.
అయితే అభిమానులు మాత్రం వీరిద్దరూ కలిసి ఉన్నప్పటి రోజులను మరచిపోలేకపోతున్నారు. అభిమానులతో పాటు సమంత కుటుంబ సభ్యులే మరచిపోలేకపోతున్నారు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు రీసెంట్‌గా నాగ చైతన్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ”చాలా కాలం క్రితం ఒక కథ ఉండేది. ఆ కథ ఇకపై ఉండకపోవచ్చు. కొత్త కథను, కొత్త అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం” అని మెసేజ్‌తో పాటు తమ కుటుంబ సభ్యులతో రిసెప్షన్, పెళ్లి సమయాల్లో నాగ చైతన్యతో ఉన్నప్పటి ఫొటోలను ఆయన షేర్ చేశారు.