Samantha: సినీనటి సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అయితే తాజాగా నటి సమంత గురించి సీనియర్ నటుడు శివాజీ రాజా ఓ కార్యక్రమంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కిసిక్ టాక్ షో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ కార్యక్రమానికి ఎంతో మంది సెలెబ్రెటీలు హాజరవ్వడం వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడం జరుగుతుంది. తాజాగా ఈ కార్యక్రమానికి నటుడు శివాజీ రాజా వచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోలో భాగంగా శివాజీ రాజా సమంత గురించి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ… తాను మా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఎంతోమంది సెలబ్రిటీలో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేవారు అయితే ఓసారి సమంత కూడా ఇండస్ట్రీపై కంప్లైంట్ చేయడానికి వచ్చిందని శివాజీ రాజా తెలిపారు. సమంత ఈ విధంగా ఇండస్ట్రీపై కంప్లైంట్స్ చేయడానికి వచ్చినప్పుడు తాను చాలా బాధపడ్డాను అని తెలిపారు. ఆమె ఇండస్ట్రీలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని ఎంత నరకం అనుభవించి ఉంటే కంప్లైంట్ చేయడానికి వస్తారని ఆలోచించి బాధపడ్డానని తెలిపారు.
అయితే సమంత ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి కూడా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న నేపథ్యంలోనే ఆమె కూడా వీటిపై ఫిర్యాదులు చేయడానికే వెళ్లిందని తాజాగా శివాజీ రాజా చేస్తున్న వ్యాఖ్యలతో స్పష్టం అవుతుంది. మలయాళం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించినప్పుడు.. అందులో ఎంతోమంది సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన నష్టాన్ని, ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. అయితే ఆ సమయంలో సమంత కూడా స్పందించిన విషయం తెలిసిందే.