Samantha : బాలీవుడ్ మోజులో పడ్డ సమంత.. సౌత్‌ని లెక్క చేయట్లేదా.?

Samantha :  సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా సమంత ఓ రేంజ్ దూకుడు చూపిస్తోంది. అందులో ఎంతమాత్రమూ సందేహం లేదు. అయితే, ఈ మధ్య సమంత బాలీవుడ్‌పై బాగా దృష్టి పెట్టింది. ఆ కారణంగానే సౌత్‌ని లెక్క చేయడం లేదంటూ కొన్ని గాసిప్పులు వినిపిస్తున్నాయ్.

ఈ మధ్య ఓ సౌత్ సినిమాకి సంబంధించి షూటింగ్ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిందట సమంత. ముంబయ్‌లో జరగబోయే ఈవెంట్‌కి హాజరవడం కోసం ఈ షూట్‌కి మధ్యలోనే బై బై చెప్పేసిందని అంటున్నారు. కానీ, సౌత్ సినిమాని సమంత నిజంగానే నిర్లక్ష్యం చేసిందా.?

ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సమంత చేస్తున్న ఆ రేంజ్ హాట్ హాట్ సందడి కూడా బాలీవుడ్ అట్రాక్షన్  కోసమేనేమో.. అంటూ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. కానీ, సౌత్ సినిమాల్నీ, నార్త్ సినిమాల్నీ సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది సమంత.

హిందీలో సమంత చేయాల్సిన సినిమాలున్న మాట వాస్తవమే. కానీ, అదే టైమ్‌లో సౌత్‌లోనూ మరీ ముఖ్యంగా తెలుగులో ‘శాకుంతలం’ వంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు సమంత చేతిలో వున్నాయ్. సో, సౌత్ సినిమాని సమంత నిర్లక్ష్యం చేసే అవకాశమే లేదు. కానీ, సమంత ‘హిందీ’ మోజు సౌత్‌ని లెక్క చేయనీయకుండా చేస్తోందన్న దుష్ప్రచారంలో మాత్రం నిజమెంతో. సమంతకే ఎరుక.