Samantha’s Bikini Show : బికినీలో సమంత.. అంత పెద్ద నేరం చేసేసిందా.?

Samantha’s Bikini Show : హీరోయిన్ సమంత ‘డోసు’ పెంచుతోంది. ఇది గ్లామర్ డోసు. ఆమె హీరోయిన్ గనుక, గ్లామర్ ప్రపంచంలో రాణించింది, రాణిస్తోంది, రాణించాలనుకుంటోంది గనుక.. గ్లామర్ షో చేస్తే తప్పేంటట.? ‘పుష్ప’ సినిమాలో స్పెషల్ సాంగ్ అయినా, బాలీవుడ్ సినిమాలకు కమిట్ అవడం అయినా, తాజాగా బికినీ షో చేయడం అయినా.. అది ఆమె ఇష్టం.

కానీ, ఈ ‘మాజీ కోడలి’ వ్యవహారం, అక్కినేని అభిమానులకి అస్సలు మింగుడుపడ్డంలేదు. సరే, వాళ్ళంతా అక్కినేని అభిమానులా.? ఆ ముసుగులో సమంతని డీగ్రేడ్ చేయడమే లక్షంగా పెట్టుకున్న హేటర్సా.? అన్నది వేరే చర్చ. కానీ, అక్కినేని అభిమానుల పేరుతో, సమంత మీద అత్యంత జుగుప్సాకరమైన ట్రోలింగ్ చేసేస్తున్నారు.

‘అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక బరి తెగించేశావ్..’ అంటూ సోషల్ మీడియాలో సమంత మీద విమర్శలు చేస్తున్నారు. రాయడానికి వీల్లేంత దారుణమైన బూతులతో విరుచుకుపడుతున్నారు. అయినా, పెళ్ళికి ముందు ఎక్స్‌పోజింగ్ చేస్తే తప్పు కాదు.. పెళ్ళయ్యాక అందాల ప్రదర్శన చేయకూడదు.. పెళ్ళయి, విడాకులు తీసుకున్నాక పూర్తిగా మడికట్టుక్కూర్చోవాలంటే ఎలా.?

సినీ నటిగా, సమంత తాను ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది. అది ఆమె ఇష్టం. పైగా, సమంత ఇప్పుడు సింగిల్. ఆమె ఎలా వుండాలనుకుంటే అలా వుంటుంది. సమంతకి బికినీ కొత్త కాదు. అయితే, పెళ్ళయ్యాక.. విడాకుల తర్వాత ఇదే తొలిసారి. అదే అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.