సమంత స్ట‌న్నింగ్ వ‌ర్కవుట్‌.. వైర‌ల్‌గా మారిన వీడియో

పెళ్లైన త‌ర్వాత కూడా స‌మంత త‌న హ‌వాని కొన‌సాగిస్తుంద‌నే చెప్పాలి. ఒక‌వైపు బిజినెస్‌లు, మ‌రో వైపు సినిమాలు, ఇంకోవైపు డిజ‌ట‌ల్ మీడియాకి సంబంధించి ప‌లు ప్రోగ్రామ్‌లు. ఇక ఖాళీ దొరికిన‌ప్పుడు భ‌ర్తతో క‌లిసి షికార్లు. ఇలా త‌న లైఫ్‌ని ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు తీసుకెళుతున్న స‌మంత ఈ మ‌ధ్య హాట్ హాట్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాని హీటెక్కిస్తుంది. పొట్టి పొట్టి దుస్తుల‌లో ఎద అందాల‌ని చూపిస్తూ కుర్ర‌కారుకి హీటెక్కిస్తుంది.

పెళ్ళైన‌ప్ప‌టికీ త‌న శ‌రీరాకృతిలో ఏ మాత్రం మార్పు రాకుండా మెయింటైన్ చేస్తున్న స‌మంత రెగ్యుల‌ర్ వ‌ర్క‌వుట్స్ విష‌యంలో ఏ మాత్రం అశ్ర‌ద్ధ చూప‌దు. జిమ్‌లో వ‌ర్కవుట్స్ చేస్తూనే వివిధ ర‌కాల ఆస‌నాలు చేస్తూ త‌న శ‌రీరంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తూ ఉంటుంది. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ అమ్మ‌డు తాను చేస్తున్న వెరైటీ ఆస‌నాల‌కి సంబంధించిన ఓ వీడియోని తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో స‌మంత చేస్తున్న వ‌ర్క‌వుట్స్ నెటిజ‌న్స్‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.

సాకీ పేరుతో వ‌స్త్ర వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టిన స‌మంత త‌న కంపెనీ ప్ర‌మోష‌న్స్ కోసం ఇలా హాట్ హాట్ ఫొటో షూట్ చేస్తుంద‌నే ప్ర‌చారం కూడా న‌డుస్తుంది. అలానే ఓటీటీ సంస్థను నెలకొల్పడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నారనీ, ఇందులో సమంత కీలక పాత్ర పోషించనుందనీ తెలుస్తోంది. శాకుంత‌లం అనే సినిమాతో పాటు ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఓకే చెప్పింది సామ్‌. ఈ చిత్రానికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు. ఈ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.