Trivikram: త్రివిక్రమ్ కాపురంలో చిచ్చుపెట్టిన నటి సమంత…. అంత పెద్ద గొడవ జరిగిందా?

Trivikram: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా మంచి సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం డైరెక్టర్గా మాత్రమే కాకుండా నిర్మాతగాను రచయితగా డైలాగ్ గా కూడా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈయన సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాలలో ఉండే డైలాగులు అందరిని అమితంగా ఆకట్టుకుంటాయని చెప్పాలి. ఇలా ఈయన డైలాగ్స్ అద్భుతంగా ఉండడంతోనే తనకు మాటల మాంత్రికుడు అనే బిరుదు కూడా ఇచ్చారు.

ఇలా దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తరచూ హీరోయిన్ల విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసినదే . ఈయన ఫలాన హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నారు అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తరచూ నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా చేస్తే పోస్టులు కూడా సంచలనంగా మారుతూ ఉంటాయి.

ఇదిలా ఉండగా నటి సమంత కారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాపురంలో చిచ్చు మొదలైందని ఏకంగా తన భార్యతో త్రివిక్రమ్ కు పెద్ద గొడవ కూడా జరిగిందంటూ ఒకానొక దశలో వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. అసలు త్రివిక్రమ్ ఆయన భార్యకు మధ్యలో సమంత చిచ్చు పెట్టడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాలలో వరుసగా సమంత హీరోయిన్గా నటించారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది నితిన్ అ,ఆ.. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలలో సమంత నటించిన ఈ మూడు సినిమాలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఇలా ఈ మూడు సినిమాల షూటింగ్స్ పూర్తి అయ్యే సమయానికి త్రివిక్రమ్ సమంత మధ్య ఎంతో మంచి స్నేహం ఏర్పడేటమే కాకుండా వీరిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఇదే విషయం గురించి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య తనతో గొడవ పడిందని తెలుస్తుంది.

ఇలా తన భార్యతో వచ్చిన గొడవలు కారణంగా త్రివిక్రమ్ ఇప్పటివరకు తిరిగి సమంతను తన సినిమాలలో తీసుకోలేదు అయితే భవిష్యత్తులో ఆమెతో కలిసి సినిమాలు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ చివరిగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.