Samantha: నాగచైతన్య వద్దన్న సమంత ఆ పాత్రలో నటించింది.. చివరికి అవార్డును సొంతం చేసుకుంది!

Samantha: అక్కినేని నాగ చైతన్య సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎంతో బ్యూటిఫుల్ కపుల్ గా ఉన్న వీరిద్దరూ పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.ఇలా విడాకులు ప్రకటన తర్వాత సమంత నాగచైతన్య పూర్తిగా వారి దృష్టిని సినిమాలపై పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సమంత వరుస పాన్ ఇండియా చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పలు సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ముంబై అవార్డుల వేడుకలో భాగంగా సమంత ఉత్తమ నటి అవార్డును ఎంపిక కావడం మనకు తెలిసిందే.

సమంత నాగచైతన్య వద్దని చెబుతున్నా కూడా పాత్ర బాగా నచ్చడంతో ది ఫ్యామిలీ మెన్2 వెబ్ సిరీస్ లో రాజీ అనే పాత్రలో నటించింది. ఈ పాత్రలో సమంత నటించింది అనడం కన్నా జీవించింది అనడం కరెక్టుగా సరిపోతుంది.అలా రాజీ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత ముంబై ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికయింది. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ఈ అవార్డును అందుకోవడంతో పలువురు ఈమె పై ప్రశంసలు కురిపించారు.

ఈ వెబ్ సిరీస్ లో సమంత మనోజ్‌ బాజ్‌ పాయ్‌కి ధీటుగా రాజీ పాత్రలో నటించింది. యాక్షన్‌ సన్నివేశాల్లో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఇదివరకు ఎప్పుడూ చూడని సమంతను ఈ వెబ్ సిరీస్ లో చూసేలా నటించి నేడు ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది. అయితే ఈ పాత్రలో నటించడం కోసం నాగచైతన్య సమంతను వద్దని ఖండించినప్పటికీ సమంత ఈ పాత్ర నచ్చడంతో నటించింది అయితే వీరు విడాకులు తీసుకోవడానికి కారణం కూడా ఈ పాత్రలో నటించడమేనని గతంలో వార్తలు కూడా వచ్చాయి.