Samantha Song From Pushpa : అక్కినేని వారి కాంపౌండ్ నుంచి బయటకి వచ్చాక స్టార్ హీరోయిన్ సమంతా ఓ రేంజ్ లో తన సినిమాలు చేస్తూ వెళ్ళిపోతుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా ఓటిటి లో కూడా పలు భారీ ఆఫర్స్ ను ఎంచుకుంటూ వెళ్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ లిస్ట్ లో తాను చేసిన ఓ హాట్ ఐటెం సాంగ్ ని చేసి ఒక్కసారిగా అందరిలో దడ పుట్టించింది.
అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ బండ్రెడ్డి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప”. వారి కెరీర్ లలోనే భారీ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో సమంతా ఇచ్చిన ట్రీట్ అయితే అంతా ఇంతా కాదు. దీనితో ఈ ఐటెం సాంగ్ మొదటి రోజే రికార్డు స్థాయి రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు మరో సెన్సేషనల్ మార్క్ ని క్రాస్ చేసినట్టు తెలుస్తుంది.
లేటెస్ట్ గా ఈ చిత్రం 200 మిలియన్ వ్యూస్ ని దాటేసిందట. దీనితో ఈ సాంగ్ టాలీవుడ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ రికార్డు అని తెలుస్తుంది. మొత్తానికి అయితే సమంతా సాంగ్ మాత్రం దుమ్ము లేపేసింది అని చెప్పాలి. మరి వేచి చూడాలి సాంగ్ ఇంకా ఎన్ని వందల మిలియన్ కి దగ్గరవుతుందో..
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికా మందన్నా నటించగా ఫహద్ ఫాజిల్ మరియు అనసూయ తదితరులు కీలక పాత్రలో నటించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.