సమంతపై ఆ ఎఫెక్ట్ తగ్గలేదు. కానీ.!

నాగచైతన్యతో వివాహ బంధాన్ని తెంచేసుకుని, ‘అక్కినేని కోడలు సమంత’ అనే ట్యాగ్‌ని తీసేసింది అందాల భామ సమంత. దాంతో అది ఆమె కెరీర్‌కి పెద్ద డ్యామేజ్‌ అవుతుందనుకున్నారంతా. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. అంతకు మించి అనే రేంజులో ఇమేజ్ దక్కించుకుంటోంది సమంత.

త్వరలోనే బాలీవుడ్ తెరపై చక్రం తిప్పబోతోంది. బాలీవుడ్ నుండి క్రేజీ ఆఫర్లు సమంతను వెతుక్కుంటూ వస్తున్నాయట. ఇప్పటికే రెండు బిగ్ ప్రాజెక్టులు సమంత టేబుల్‌పై ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి బాలీవుడ్ స్టార్ హీరో మూవీ కాగా, మరోటి యంగ్ హీరో మూవీ అని తెలుస్తోంది.

ఈ సినిమాల కోసం సమంతకు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారట. సమంత ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారట అక్కడి మేకర్స్. ఇకపోతే, బాలీవుడ్ యంగ్ హీరో ప్రాజెక్ట్ సమంతను వెతుక్కుంటూ రావడానికి గల కారణం.. తెలుగు, తమిళ భాషల్లో సమంతకున్న క్రేజే అని తెలుస్తోంది.

సదరు యంగ్ హీరో తన సినిమాని మూడు భాషల్లో రూపొందించాలనుకుంటున్నాడట. తమిళ, తెలుగు భాషల్లో సమంత మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని, ఏరి కోరి ఆమెనే హీరోయిన్‌గా పెట్టుకోవాలనుకుంటున్నాడట. అన్నట్లు ఈ సినిమాకి ఆ హీరో సహనిర్మాతగానూ వ్యవహరిస్తుండడం విశేషం. సమంతతో పాటు, ఓ పాపులర్ సౌత్ డైరెక్టర్ ఈ సినిమా కోసం పని చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.