బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా ఇప్పుడు తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తో ఓ సాలిడ్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా షూట్ సమయంలోనే షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని వార్త రావడం షారుఖ్ కి షాక్ ఇచ్చింది.
సరే ఇదిలా ఉండగా ఈ సినిమాపైనే లేటెస్ట్ గాసిప్ ఒకటి వినిపిస్తుంది. ఈ పాన్ ఇండియన్ సినిమాలో షారుఖ్ సరసన నటించే ఆఫర్ నే స్టార్ హీరోయిన్ సమంతా వదులుకున్నట్టు తెలుస్తుంది.
షారుఖ్ సరసన ఆల్రెడీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యినటువంటి నయనతార కన్నా ముందు సమంతా పేరు అనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల సమంతా ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదట. మరి ఈ చిత్రానికి మేకర్స్ “లయన్” అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడని వినికిడి.