Samantha: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయి బాక్సాఫీసు వద్ద మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో అగ్రతార సమంత నటించడం విశేషం. ప్రస్తుతం ఎక్కడ చూసినా యువతలో ఇదే పాట ఉర్రూతలూగిస్తుంది. ఊ..అంటావా మావ..’అంటూ యువత సైతం ఈ పాటకు డాన్సులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ పాట విడుదలైన తర్వాత ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంది. మగవాళ్లను కించపరిచే విధంగా ఈ పాటను చిత్రీకరించారనీ పెద్ద ఎత్తున వివాదం సృష్టించారు. అయితే ఇప్పటి వరకు ఈ పాట పై రచయిత చంద్రబోస్ అల్లు అర్జున్ అందరూ స్పందించి ఇప్పటి వరకు సమంత మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. ఈ క్రమంలోనే సమంత మొట్టమొదటిసారి ఈ పాట పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను చేసే ప్రతి ఒక్క పనిలోనూ పర్ఫెక్షన్ ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాను. కేవలం నటన మాత్రమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలపై కూడా సందడి చేశాను. ప్రతి సినిమాలో కోసం నేను కష్టపడతాను..అయితే సెక్సీగా కనిపించడానికి రెండింతలు కష్టపడాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలోని ఊ..అంటావా మావ.. అనే పాటలో నటించడం కోసం ఎంతో కష్టపడ్డాం అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.