Samantha: స్పెషల్ సాంగ్ కోసం సమంత అన్ని కోట్ల రెమ్యూనరేషన్?

Samantha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17న థియేటర్లలో పాన్ ఇండియా లెవల్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అవ్వడంతో పాటు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన కు ఒక సూపర్ హిట్ సినిమాను అందించారు.

ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల నటనకు గాను పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ కు చిందులు వేసిన విషయం అందరికి తెలిసిందే. పుష్ప సినిమా హిట్ అవడానికి ముఖ్య కారణం సమంత చేసిన స్పెషల్ సాంగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సమంత చేసిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులను సృష్టించడమే కాకుండా, ఈ సినిమా విడుదల అయి నేటికి నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటికి ఈ పాట ట్రెండింగ్ లోనే ఉంది. పుష్ప సినిమా క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. స్పెషల్ సాంగ్ తో సమంత మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

ఇక ఈ పాటలో సమంత వేసిన స్టెప్పులు, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ పాటను రీ క్రియేట్ చేస్తూ వందల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పాట కోసం సమంత కూడా భారీగానే రెమ్యూనరేషన్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు నిమిషాల పాట కోసం సమంతా దాదాపుగా ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకుంది. అయితే మొదట ఈ పాటను చేయడానికి చిత్రబృందం సమంతను సంప్రదించినప్పుడు అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత అల్లు అర్జున్ చెప్పడంతో సమంత ఆ పాట గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఆ పాటతో ప్రేక్షకులను మైమరిపించింది. అంతే కాకుండా సమంత ఒప్పుకోవడానికి ముందు కొన్ని షరతులను కూడా విధించింది. కానీ షూటింగ్ సమయంలో మాత్రం సమంత ఒక్క స్టెప్పులు కూడా మార్చమని అడగ లేదు అని ఈ చిత్ర బృందం తో సంబంధం ఉన్న ఒక వ్యక్తి ఈ విషయాన్ని తెలిపారు.