Samantha: సినీనటి సమంత తిరిగి ఇండస్ట్రీలో ఎంతో బిజీ అవుతున్నారు. తన వ్యక్తిగత కారణాలవల్ల ఆరోగ్య సమస్యల కారణంగా ఎన్ని రోజులు పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత తిరిగి వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో సమంతకు తిరిగి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి ఇలా కెరియర్ పరంగా సమంత ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే తాజాగా తన మొదటి సినిమా గురించి అలాగే కెరియర్ మొదట్లో సంఘటనల గురించి సమంత గుర్తు చేసుకున్నారు. తనకు కెరియర్ మొదట్లో ఇండస్ట్రీలో ఎవరు తెలియదు పెద్దగా భాష రాదు, అందుకే కాస్త ఇబ్బంది పడ్డానని తెలిపారు.
ముఖ్యంగా గ్లామరస్ పాత్రలల నటించడం కోసం ఇబ్బంది పడ్డానని సమంత తెలిపారు. ఇక అప్పట్లో నేను నటించిన పాత్రలు కనుక ఇప్పుడు చూస్తే నాకే చాలా నవ్వొస్తుందని ఇలా నటించగలిగాను అంటూ నాకే హాస్యాస్పదంగా ఉందని సమంత వెల్లడించారు. ఇక తన మొదటి చిత్రం మాస్కో కావేరి రాహుల్ రవీంద్రన్ తో కలిసి చేశాను. కానీ అది షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. ఆ తరువాత ఏ మాయ చేసావే సినిమా విడుదల అయిందని తెలిపారు.
ఏ మాయ చేసావే సినిమాకు సంబంధించి ప్రతి సీన్, ప్రతి షాట్ నాకు గుర్తుంది. కార్తీక్ ని గేట్ దగ్గర కలిసే షాట్ నా మొదటి షాట్. గౌతమ్ మీనన్ గారు ఆ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా నా కెరియర్ లో ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఈ 15 ఏళ్లలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసాను అంటే సమంత తన కెరియర్ మొదటి రోజులను గుర్తు చేసుకుంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.