మేగజైన్ కోసం గ్లామరస్ లుక్ లో సందడి చేస్తున్న సమంత.. ఫోటో వైరల్!

వెండితెర అగ్రతారగా కొనసాగుతున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చి అందరిని మాయ చేసిన సమంత సినిమా అవకాశాలను అందుకుని దూసుకుపోయారు. ఈ క్రమంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడటం ఆయనని పెళ్లి చేసుకోవడం ఆయనతో మనస్పర్థలు వచ్చి విడిపోవడం అన్నీ కూడా జరిగిపోయాయి. ఇక విడాకులు తీసుకున్న తర్వాత సమంత పూర్తిగా తన వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితం పై శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమా అవకాశాలను అందుకొని సమంత తన కెరియర్ లో దూసుకుపోతోంది.

ఇక నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన గ్లామరస్ ఫొటోలు వీడియోలను షేర్ చేస్తూ రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారాయి. సాధారణంగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉండడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే సమంత ఇప్పటికే ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈమె పీకాక్ మేగజైన్ కోసం ఫోటో షూట్ నిర్వహించారు. పీకాక్ మేగజైన్ కోసం సమంత తన డిజైనర్ ప్రీతమ్ డిజైన్ చేసిన దుస్తులను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారి ఎంతోమంది ఈ ఫోటోపై లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోలలో సమంత ఎంతో బోల్డ్ గా కనిపిస్తున్నారు. ఎద అందాలను ఆరబోస్తూ సమంత ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నేటింట్లో చక్కర్లు కొడుతున్నాయి.