Samantha: నాగచైతన్యకు నేను మొదటి పెళ్ళాన్ని కాదు….ఫస్ట్ భార్య పై సమంత సంచలన వ్యాఖ్యలు?

Samantha: సినీనటి సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్న ఆయనతో విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న నాగచైతన్య సమంత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడంతో సమంత ఇప్పటికీ ఒంటరిగా ఉండగా నాగచైతన్య మాత్రం శోభితను తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు.

ఇలా శోభిత నాగచైతన్య ప్రస్తుతం వారి వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లు తెలియజేశారు. ఇకపోతే సమంత నాగచైతన్య ఎందుకు విడాకులు తీసుకొని విడిపోయారనే విషయం గురించి తెలుసుకోవటానికి ఇప్పటికీ కూడా అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి విడాకులకు సంబంధించిన విషయాలు కానీ వీరి వ్యక్తిగత విషయాలు కానీ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

ఈ క్రమంలోనే నటి సమంత తన భర్త నాగచైతన్య మొదటి పెళ్ళాన్ని నేను కాదంటూ గతంలో ఈమె 2019 లో ఓ కార్యక్రమంలో చెప్పిన మాటలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా సమంత మాట్లాడుతూ నేను నాగచైతనే మొదటి పెళ్ళాన్ని కాదని ఆయనకు నాకంటే ముందే ఇంకో భార్య కూడా ఉందని తెలిపారు.

నాగ చైతన్యకు నేనంటే కూడా దిండు అంటేనే ఇష్టమని తెలిపారు. ఆయన కూర్చుంటే తన పక్కనే ఉండాలి ,పడుకున్న తన పక్కనే దిండు ఉండాల్సిందేనని తెలిపారు. ఇక మా బెడ్రూంలో మేమిద్దరం పడుకున్న మా మధ్య ఆ దిండు ఉండాల్సిందేనని సమంత తెలిపారు. నాగచైతన్యకు దిండు లేకపోతే తోచదు అందుకే నీ మొదటి భార్య దిండే అంటూ నేను చైతన్యను టీస్ చేస్తూ ఉంటాను అంటూ సమంత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు అయితే ప్రస్తుతం శోభిత పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.