సమంత నోరు తెరిస్తే గోడవలే

Samantha maintaining silence over The Family Man 2 controversy
Samantha maintaining silence over The Family Man 2 controversy
సినిమా తారల మీద కామెంట్లు చేస్తే చూసీ చూడకుండా వదిలేసే రోజులు పోయాయి. ముఖ్యంగా హీరోయిన్లు.  విమర్శలు చేస్తే ఘాటుగా స్పందిస్తూ తమ వెర్షన్ బల్లగుద్ది చెప్పేస్తున్నారు.  అలాంటి వారిలో సమంత కూడ ఒకరు.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అంశం మీద రెస్పాండ్ అవుతూ ఉంటుంది.  ఒక్కోసారి దిమ్మతిరిగే సమాధానాలు ఇస్తుంటుంది.  అలాంటి సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ -2’ వివాదంలో మాత్రం సైలెంట్ అయిపోయింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్లో సమంత కీలకమైన తమిళ రెబల్ పాత్ర పోషించడం జరిగింది. ట్రైలర్ విడుదలయ్యాక సమంత పాత్ర మీద తమిళులు అభ్యంతరాలు చెప్పడం స్టార్ట్ చేశారు.  
 
తమిళులను అవమానపరిచే రీతిలో ఉన్న వెన్ సిరీస్లో నటించినందుకు సమంత మీద నిప్పులు చేరుగుతున్నారు. వెబ్ సిరీస్ బ్యాన్ చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. అయినా జూన్ 4వ వెబ్ సిరీస్ రిలీజవుతోంది.  దీంతో తాజాగా కూడ షేమ్ ఆన్ యు సమంత అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.  రాజ్ అండ్ డీకే ఎంత వివరణ ఇచ్చినా తమిళులు తగ్గేలా కనిపించట్లేదు. మామూలుగా అయితే సమంత ఇలాంటి వ్యవహారాల్లో తనను తాను బాగా డిఫెండ్ చేసుకుంటుంది.  కానీ ఈ విషయంలో మాత్రం సైలెంట్ అయిపోయింది.  
 
ఎందుకంటే తమిళుల కోపం పెంచుకున్నారు అంటే ఎంతవరకైనా వెళ్తారు. విజయ్ సేతుపతి లాంటి వాళ్లే వారి కోపాన్ని తట్టుకోలేకపోయారు. ఒకవేళ సమంత గనుక రెస్పాండ్ అయి ఉంటే ఇష్యూ ఇంకా సీరియస్ అయ్యేదే.  ఆమె తదుపరి చిత్రాల మీద కూడ దీని ప్రభావం గట్టిగా ఉండేది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే సమంత నోరు తెరిచి గొడవలు పెంచుకోవడం ఎందుకని సైలెంట్ అయిపోయింది.