వైరల్ : ఒంటరితనంపై సమంతా నుంచి ఓ ఆసక్తికర పోస్ట్.!

ఇప్పుడు ఒక్క సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా ఓ స్టార్ గా మారిన హీరోయిన్ సమంత. తన పర్సనల్ లైఫ్ పరంగా బ్రేక్ తీసుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సమంతా ఇక నెక్స్ట్ అయితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. భారీ ఆఫర్స్ ఏకంగా పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ వరకు కూడా ఆమె సొంతం చేస్కుంటూ సినీ వర్గాలకి షాక్ ఇస్తుంది.

మరి ఇప్పుడు పలు భారీ ప్రాజెక్ట్ లతో ఆమె బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆమె పర్సనల్ లైఫ్ కి సంబంధించి చైతు తో విడాకుల అనంతరం అనేక ప్రశ్నలు ఆమెని వెంటాడడం తగ్గలేదు. అయితే ఆమె ఇదే సమయంలో కొన్ని ఆసక్తికర పోస్ట్ లు పెట్టడం కూడా ఒకోసారి వైరల్ గా ఒకింత ఆసక్తిగా మారుతుంది.

ఇప్పుడు అలాగే తన ఒంటరితనంపై పెట్టిన పోస్ట్ ఒకటి అయితే ఆసక్తిగా మారింది. “ఎప్పుడైనా నువ్ ఇది వినాల్సి వస్తుందేమో అంటూ ఎప్పుడూ కూడా ఒంటరిగా ప్రయాణం చెయ్యకు అంటూ” పోస్ట్ చేసింది. పైగా తాను వేసుకు తీ షర్ట్ పై కూడా ఇదే కొటేషన్ ఉండడంతో దానిని షేర్ చేయడం ఇపుడు ఆసక్తిగా మారింది.

అంటే మళ్ళీ తన రిలేషన్ షిప్ లో ఏమన్నా మార్పు వచ్చిందా అనే హింట్ లా ఇది ఉంది అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ పోస్ట్ తో సమంత మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది.