Samantha : ఆ హీరోతో నాలుగో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత… తగ్గేలా లేదుగా?

Samantha :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు తన అందం, అభినయంతో ప్రేక్షకులను మాయ చేసి తన అభిమానులుగా మార్చుకుంది. మొదటి సినిమా సూపర్ సక్సెస్ అవడంతో జీవితంలో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్ , హిందీ, కన్నడ వంటి పలు భాషల్లో సినిమాలు చేస్తూ నిత్యం బిజీగా ఉంటుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

సమంత అందమైన ఫోటోలతో పాటు..తన లైఫ్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ ఫోటోలో ఎరుపు రంగు దుస్తులలో అచ్చం పెళ్లికూతురులా సమంత మెరిసిపోతుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం యశోద, శాకుంతలం, ఖుషి సినిమాల షూటింగ్ లో సమంత బిజీగా ఉంటుంది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

ప్రస్తుతం సమంత చేతిలో మూడు సినిమాలున్నాయి ఇప్పటికీ మరొక సినిమాకి కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ హీరో విజయ్ తో కలిసి నటించటానికి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘కాతువాకుల రెండు కాదల్‌’ సినిమా లో నయనతారతో కలిసి నటించింది. ప్రస్తుతం లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న విజయ్ 67 వ సినిమాలో ఆయనకి జోడీగా సమంత అయితే బెస్ట్ అని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. అయితే సమంత ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే విజయ్ తో కలిసి సమంత నటిస్తున్న నాలుగో సినిమా అవుతుంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.