చైతన్యకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆ పేపర్లో పై సంతకం చేయించిన సమంత..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందమైన జంటగా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్న వారిలో సమంత నాగచైతన్య జంట ఒకటిగా ఉండేది.వీరిద్దరు ఏం మాయ చేసావే సినిమా ద్వారా పరిచయం ఏర్పర్చుకొని అనంతరం ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఈ విధంగా వివాహమైన నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈ జంట చివరికి విడాకులు తీసుకొని విడిపోయారు.ఈ విధంగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో విడాకులకు కారణం ఏంటి అంటే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.

సమంత నాగచైతన్య విడిపోవడానికి సమంతనే కారణం అంటూ కొన్ని వార్తలు షికార్లు చేసిన సమంత వాటిని మౌనంగా భరిస్తూ వచ్చింది. అయితే సమంత అక్కినేని కుటుంబం కోసం తన భర్త చైతన్య కోసం ఎంతో శ్రమించారు. చైతన్య తన కెరియర్లో ముందుకు వెళ్ళడానికి సమంత వెనుక ఉండి నడిపించిందని తెలుస్తోంది.నాగ చైతన్య సినిమా వ్యవహారాలు అన్నింటిని కూడా సమంత చూసుకునేదని ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న దూత వెబ్ సిరీస్ కూడా సమంత కారణంగానే నాగచైతన్య సంతకం చేసినట్లు తెలుస్తోంది.

మొదట ఈ వెబ్ సిరీస్ చేసే అవకాశం సమంతకి వచ్చింది. తనకు ఎంతగానో నచ్చిన ఈ వెబ్ సిరీస్ చైతన్యకు చెప్పి చైతన్య ఇందులో నటించడానికి ఒప్పించారట. ముందుగా నాగచైతన్య ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు తనకు సెట్ కావని ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపించలేదట.అయితే కెరీర్ లో ముందుకు వెళ్లాలంటే విభిన్నమైన పాత్రలో నటించాలని చైతన్యకు బలవంతంగా సర్దిచెప్పి దూత వెబ్ సిరీస్ అగ్రిమెంట్ పై బలవంతంగా చైతన్యతో సమంత సంతకం చేయించారట.ఈ విధంగా సమంత నాగచైతన్య కెరీర్ ముందుకు వెళ్లడానికి అహర్నిశలు శ్రమించిన సమంత నాగ చైతన్యతో ఎందుకు విడిపోయారు అనే విషయం ఇప్పటికీ తెలియడంలేదనీ చెప్పాలి.