Samantha: యశోద సినిమా కోసం సమంత ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా..?

Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. వెబ్ సిరీస్ తో, స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అలరిస్తు కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇక నాగచైతన్య తో విడాకుల తర్వాత సమంత కెరీర్ ఫై పూర్తిగా ఫోకస్ పెట్టి చేతినిండా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీగా ఉంది. ఇకపోతే సమంత ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ఆయన యశోద సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఈ సినిమా నుంచి సమంత ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సమంత లుక్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇదిలా ఉంటే సమంత యశోద సినిమాకు గాను ఎంత పారితోషికం తీసుకుని అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సమంతా ఈ సినిమాకు గాను 3 కోట్ల పారితోషికం తీసుకుని అని వార్తలు వినిపిస్తున్నాయి. యశోద సినిమా 30 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.