పవన్ కోసం సమంత మనసు మార్చుకుంటుందా

Samantha changing her decision for Pawan Kalyan
Samantha changing her decision for Pawan Kalyan
స్టార్ హీరోయిన్ సమంత స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ఎప్పుడో ఆపేశారు.  లేడీ ఓరియెంటెడ్, స్టోరీ బేస్డ్ సినిమాలు మాత్రమే చేస్తోంది ఆమె.  ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చిన ఆమె తనకంటూ సొంత క్రేజ్ ఏర్పడగానే వాటిని పక్కనపెట్టేశారు.  ‘రంగస్థలం’ చిత్రమే పెద్ద హీరోతో ఆమె చేసిన ఆఖరి చిత్రం.  ఒక దశలో హీరోయిన్స్ హీరోలంటే ఏమాత్రం తక్కువ కాదని, వారికి ఇచ్చినట్టే కోట్ల రెమ్యునరేషన్ హీరోయిన్లకు కూడ ఇవ్వాలని తిరుగుబాటు ధోరణిలో అందుకుంది.  సమంత శైలి చూసిన అందరూ ఇకపై ఆమె స్టార్ హీరోల సినిమాలు చేయదనే నిర్ణయానికి వచ్చేశారు.  
 
ఈమధ్య కాలంలో సెట్టయిన స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆమె వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చారు. రెమ్యునరేషన్ కూడ కోట్లలో అడుగుతుండంటంతో నిర్మాతలు సైతం ఆమెను అప్రోచ్ అవ్వాలంటే జంకుతున్నారు.  ఇలా స్టార్ హీరోల సినిమాలను కావాలనే దూరం పెట్టిన సమంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు సైన్ చేస్తోందనే వార్తలు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిటయ్యారు. ఆగష్టు నెలలో చిత్రం మొదలవుతుంది. ఇందులో కథానాయిక పాత్ర కోసం మేకర్స్ సమంతను సంప్రదించారని, ఆమె కూడ సుముఖంగానే ఉన్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని అంటున్నారు.  మరి సమంత నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమా కోసం తన ఐడియాలజీని మార్చుకుంటున్నారేమో చూడాలి.  ఇకపోతే గతంలో సమంత, పవన్ కళ్యాణ్ కలసి సూపర్ హిట్ మూవీ ‘అత్తారింటికి దారేది’లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.