Samantha: సమంత ఇంట్లో దొంగతనం.. అరెస్టయిన స్టార్ హీరో..?

Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సమంత ఇంట్లో అర్ధరాత్రి సమయంలో దొంగలు పడిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే నిజంగానే సమంత ఇంట్లో దొంగలు పడ్డారు అనుకుంటే పొరపాటే. సమంత ప్రస్తుతం వరుస సినిమాలతోను అలాగే బ్రాండ్ అంబాసిడర్ గా పలు బ్రాండ్లకు వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత ఒక యాడ్ లో భాగంగా ఈ దొంగతనం ఘటన చోటు చేసుకుంది.

ఈ క్రమంలోనే సమంత అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కలిసి ఒక యాడ్ చేశారు. వీరిద్దరు కలిసి
కుర్ కురే చిప్స్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరించడంతో యాడ్ ఇటీవలే విడుదలైంది.ఈ యాడ్ లో భాగంగా అక్షయ్ కుమార్ సమంత ఇంటికి దొంగతనానికి రాగా అతనికి కుర్ కురే ప్యాకెట్ కనబడుతుంది. దీంతో అక్షయ్ కుమార్ ఆ ప్యాకెట్ ఓపెన్ చేయగా ఆ శబ్దానికి సమంత కుటుంబ సభ్యులు అందరూ వస్తారు. వాళ్లు అతని దగ్గర నుంచి ఆ ప్యాకెట్ లాక్కొని తింటూ ఉండగా అక్షయ్ కుమార్ కూడా ఆ రుచిని ఆస్వాదిస్తూ నోరూరిస్తూ ఉంటారు.దీంతో కావాలా అని సమంత అడిగినప్పుడు అక్షయ్ కుమార్ కావాలని అడిగితే వెంటనే ప్యాకెట్ మొత్తం అతనికి ఇస్తుంది.

ఇలా ప్యాకెట్ మొత్తం ఖాళీ చేసి అక్షయ్ కుమార్ వెళ్తున్న సమయంలో సమంత ఆగు బండి వస్తుందని చెబుతుంది. దీంతో బండి కూడా వస్తుందా అని అక్షయ్ కుమార్ సంతోషపడే లోపు పోలీస్ సైరన్ మోగడంతో అక్షయ్ కుమార్ కంగు తింటాడు. దీంతో ఈ యాడ్ పూర్తి అవుతుంది. ఈ వీడియోని సమంత సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ సినిమాలలో పోలీస్ గా నటించిన అక్షయ్ కుమార్ దొంగగా మారి పోయారు ఏంటి ఈయన ప్రవర్తన అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది.