Rana-Samantha: రానా కోసం స్పెషల్ పోస్ట్ చేసిన సమంత.. నేను ఎప్పటికీ నీ అభిమానినే అంటూ!

Rana-Samantha: టాలీవుడ్ హీరో నటుడు రానా, అలాగే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. వీధులు పలుసార్లు టాక్ షోలో సరదాగా మాట్లాడుతూ చాలా సందర్భాలలో అభిమానులను మెప్పించారు. అయితే తాజాగా రానా పుట్టినరోజు సందర్భంగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ ను చేసింది. రానాకు స్పెషల్గా బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూనే తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది. హ్యాపీ బర్త్‌డే రానా. నీవు చేసే ప్రతి పనిలోను 100 శాతం ఎఫర్ట్‌ పెట్టి శ్రమిస్తావు. నేను కూడా నిన్ను స్ఫూర్తిగా తీసుకున్నాను.

నీ మాదిరే నేను కూడా ప్రతి పనిని ఇంకా బాగా చేయాలి అనే కోరుకుంటున్నాను. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది సామ్. ఈ సందర్భంగా సమంత చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆ పోస్ట్ పై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాగే హీరో రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంది.

ఇటీవల సమంత తన తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న సమంత ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఆ బాధ నుంచి కోలుకుంటోంది. ఇక రానా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఒకవైపు హీరోగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఇటీవల రానా టాక్ షో అంటూ ఒక టాక్ షోని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ షో కి హాజరయ్యారు. అందులో భాగంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో జక్కన్న ఈ షోకి హాజరైన విషయం తెలిసిందే. నవ్వుతూనే చాలా విషయాలను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు రానా. ఇంకా ముందు ముందు ఈ షో కి ఎలాంటి సెలబ్రిటీలు వస్తారో చూడాలి మరి.