సమంతలో ఈ తిరుగుబాటు ఎందుకు, ఎవరి మీద ?

Samantha
Samantha
Samantha

టాలీవుడ్ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఎప్పుడూ చర్చల్లో ఉంటోంది. ఒక్క హిట్ పడగానే హీరోయిన్ పారితోషకాన్ని అమాంతం రెట్టింపు చేయడమా అనేది పరిపాటిగా మారింది. హీరోయిన్లు నిర్మొహమాటంగా భారీ మొత్తం డిమాండ్ చేస్తుండటంతో నిర్మాతలకు చుక్కలు కనబడుతున్నాయి. ఒక్క సినిమాకే ఇంత డిమాండ్ అయితే ఎలా అని ఆఫ్ ది రికార్డ్ వాపోతున్న నిర్మాతలు కోకొల్లలు. అయితే వారి బాధలో అర్థం లేదన్నట్టు అంటోంది స్టార్ నటి సమంత.

సమంత కూడ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదాలో కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్నవారే. అయితే అందులో తప్పేంటి అంటున్నారామె. ఎవరైనా హీరో భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటే ఏమీ అనరు కానీ హీరోయిన్ కాస్త ఎక్కువ అడిగితే అదేదో తప్పు అన్నట్టు ఫీలైపోతారే అంటోంది ఆమె. ఇండస్ట్రీలో టాప్‌ 3లో ఉన్న హీరోయిన్‌కు కనీసం టాప్‌ 20కూడా లేని హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్‌ కంటే తక్కువగానే ఇస్తారని, రెమ్యునరేషన్ పెంచితే ఏదో క్రైమ్ అన్నట్టు చూస్తారని హీరోలను మాత్రం ప్రశ్నించరని, హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడ పారితోషకం తీసుకునే రోజులు తొందర్లోనే రావాలని పెద్ద క్లాస్ ఇచ్చేశారు. మరి ఉన్నట్టుండి సమంతలో ఈ తిరుగుబాటు ధోరణి ఎందుకు వచ్చినట్టో.