Samantha: శాకుంతలం సినిమా నుండి లేటెస్ట్ బజ్… ఆ రోజే సమంత ఫస్ట్ లుక్..!

Samantha: టాలీవుడ్ లోని టాప్ హీరోయిన్ లలో సమంత ఒకరు. ఈమె తన నటనతో వివిధ రకాల వైవిధ్యమైన పాత్రలను పోషించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్ వంటి పలు భాషలలో ఎన్నో సినిమాలలో నటించింది. ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైన ఈ అమ్మడు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. సమంత నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత తన లైఫ్ లో చాలా బిజీ అయిపోయింది.

విడాకుల అనంతరం కొంతకాలం సినిమాల నుండి బ్రేక్ తీసుకొని డివోషనల్ టూర్స్, ఫ్రెండ్స్ తో వెకేషన్స్ ఎంజాయ్ చేసిన సమంత ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీ అయిపోయింది. సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ అప్డేట్స్ అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం సమంత యశోద సినిమాలో నటిస్తోంది.ఇదిలా ఉండగా సమంత నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

శాకుంతలం సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరహాలోనే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ రిలీజ్ అవుతుంది అని ప్రేక్షకులకి అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా నుండి ఇ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. శాకుంతలం సినిమా నుండి సమంత పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ నెల 21వ తేదీ ఉదయం 9 గంటల 30 నిమిషాలకు రాబోతుందని శాకుంతలం మేకర్స్ తెలిపారు. సమంత టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం.మొత్తానికి సమంత విడాకుల తర్వాత వరుస ఆఫర్లతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది.