అక్కినేని నాగార్జున అనేక సార్లు తమ కుటుంబం లో అత్యంత మంచి వాడు ఎవరన్నా ఉంటే అది తన కొడుకు నాగ చైతన్య మాత్రమే అని చెప్పాడు. చైతన్య చాలా నెమ్మదస్తుడని, తనకు అస్సలు కోపం రాదనీ చాలా పొగిడాడు. తను ఇష్టపడ్డ సమంత తోనే చాలా ఆర్బాటంగా పెళ్ళిచేసాడు.
పెళ్లి తర్వాత సమంత ని తన కూతురితో చూసుకున్నాడు. చాలా సందర్భాల్లో సమంత తనకు కూతురు లేని లోటు తీర్చిందని నాగార్జున అన్నాడు. అయితే నాగ చైతన్య, సమంత ల వివాహ బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. పెళ్ళైన నాలుగు సంవత్సరాల తర్వాత ఇద్దరు విడిపోయారు.
సమంత ‘ఫామిలీ మాన్’ వెబ్ సిరీస్ లో నటించడం, ఎక్సపోసింగ్ చెయ్యడం, అలాగే తన స్టైలిస్ట్ తో సమంత ఎక్కువ చనువుగా ఉండడం వాళ్ళ బ్రేక్ అప్ కి కారణాలు అని న్యూస్ వచ్చింది. అయితే దీని పై చైతన్య మాత్రం స్పందించలేదు, కానీ సమంత మాత్రం అప్పుడప్పుడు అక్కినేని ఫామిలీ మీద ఏవో ఒక కామెంట్స్ చేస్తూ ఉంది. ఎలాగైనా ఇద్దరికీ సర్ది చెప్పి కలపాలని సమంతాకు నాగార్జున ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదట.. అప్పుడే సమంత పక్కన ఉన్న ఒక టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు కదా అని అంటే .. ఆయనకు అంత సీన్ లేదు.. ఆయన భార్య చెప్పినట్టే వింటారు.. ఆయనతో మాట్లాడి వేస్ట్ అని అందరి ముందే అనేసిందట. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ అక్కినేని ఫ్యాన్స్ కు మాత్రం సమంత ను ట్రోల్ చేస్తున్నారు.