అక్కినేని కోడలు సమంత వెండితెరపై ఎన్ని అద్భుతాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి పాత్రలోను జీవించి ప్రేక్షకులకు పసందైన వినోదం అందించిన సామ్ స్టార్ హీరోయిన్‌గా మంచి స్టేటస్‌ని సంపాదించుకుంది. ఇక ఈ మధ్య కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. బిగ్ బాస్ షోని హోస్ట్ చేసిన తర్వాత మెల్లగా ఆహా అనే ఓటీటీ కోసం సామ్ జామ్ అనే టాక్ షోని మొదలు పెట్టింది. ఈ షోలో ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని అందిస్తుంది.
న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న అల్లు అర్జున్‌తో సమంత చేసిన సందడికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ప్రోమో విడుదల చేశారు. ఇందులో సమంత .. అల్లు అర్జున్ తనయుడు అయాన్‌తో ఫోన్ లో మాట్లాడింది చూపించారు. అయాన్ మా నాన్నని ఈ ప్రశ్న వేయండని అడిగారు. దీనికి సామ్ ముసిముసినవ్వులు నవ్వింది. ఇక పెళ్లి అయ్యాక మీలో చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది అని సమంత అడగగా, దానికి బదులిచ్చిన బన్నీ .. తండ్రి అయ్యాక ఇంట్లో బూతులు మాట్లాడటం చాలా తక్కువ చేశాను అంటూ గుట్టు విప్పాడు. ఇక అల్లు అరవింద్ కూడా బన్నీ చిన్నప్పుడు చేసిన అల్లరిని కూడా రివీల్ చేశాడు
స్టైలిష్ స్టార్‌గా పిలిపించుకుంటున్న బన్నీ తన అభిమానులకి మంచి రెస్పెక్ట్ ఇస్తాడనే సంగతి మనందరికి తెలిసిందే. ఈ విషయాన్ని సామ్ జామ్ షో ద్వారా మరోసారి రివీల్ చేశాడు. ఫ్యాన్స్ కోసం ప్రస్తావన వచ్చినపుడు తల్లిదండ్రుల ప్రేమ ఎలా అయితే ఏమీ ఆశించకుండా ఉంటుందో అభిమానుల ప్రేమ కూడా అలానే ఉంటుంది అని వారిది తనపై ఒక అన్ కండీషనల్ లవ్ అని చెప్పాడు. అంతేకాదు తన తల్లి దండ్రుల తర్వాత స్థానాన్ని తన అభిమానులకే ఇచ్చాడు. ఒక్క ప్రోమోతోనే సంచలనాలు సృష్టిస్తున్న బన్నీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక ఇంకేం చేస్తాడో మరి!
“Fans’ Love is Unconditional ♥”
Here’s a glimpse of #SamJam with Stylish Star @alluarjun.Full episode premieres 01.01.2021 #SamJamWithAA #AlluArjun @Samanthaprabhu2 #AlluAravind @thesamjamshow pic.twitter.com/Jha08LUHe8
— ahavideoIN (@ahavideoIN) December 27, 2020